అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్ - tdp walk out from assembly news
అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులు మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో సభ నుంచి తెదేపా వాకౌట్ చేసింది. అనంతరం లాబీలో తెదేపా సభ్యులు నినాదాలు చేశారు.