ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఎస్సీ, ఎస్టీ బిల్లు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వీళ్లను ఎప్పుడూ చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వారికి మంచి చేయాలనే ఆలోచన రాలేదన్నారు. భవిష్యత్లో ప్రశ్నిస్తారనే ఆందోళనతోనే బిల్లును అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఒకే ఎస్సీ సభ్యుణ్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం రాజకీయం చేస్తోందన్నారు. ఎస్సీలకు మంచి చేసే బిల్లును అందరూ ఆమోదించాలని సీఎం కోరారు.