రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. వైకాపా వచ్చాక ప్రజలపై విద్యుత్ భారాన్ని 40 వేల కోట్ల రూపాయలు చేసిందన్నారు. తెదేపా హయాంలో 200 రూపాయల బిల్లు వస్తే.. నేడు 2వేల రూపాయలు వస్తోందని మండిపడ్డారు.
గతేడాది స్లాబుల పేరుతో మాయ చేసి రూ. 1500 కోట్లు భారం ప్రజలపై మోపారని విమర్శించారు. రెండేళ్ల పాలనలో 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే.. వైకాపా రాజన్న రాజ్యమా అని నిలదీశారు. తిరుపతి ఉపఎన్నికలో వైకాపాని ఓడిస్తేనే ప్రజలంటే వైకాపాకి భయం పుట్టుకొస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: