ETV Bharat / city

ATCHENNAIDU: 'సీఎం తండ్రి విగ్రహాలే ఉండాలా.. మరే మహానుభావులవి ఉండొద్దా' - TELUGU NEWS

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ వారిపై నామమాత్రపు కేసులు పెట్టి.. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన వారిపై మాత్రం క్రిమినల్ కేసులు పెడ్తారా? అంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp-state-president-atchenna-comments-on-ntr-statue-issue
'సీఎం తండ్రి విగ్రహాలే ఉండాలా.. మరే మహానుభావులవి ఉండొద్దా'
author img

By

Published : Jan 3, 2022, 2:13 PM IST

రాష్ట్రంలో జగన్ తండ్రి విగ్రహాలు తప్ప మరే మహానుభావులవి ఉండకూడదా? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడి, మారణాయుధాలతో ప్రజలను భయపెట్టిన వారిపై ఐపీసీ 294, 427 లాంటి నామమాత్రపు కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా శ్రేణులపై పెట్టిన కేసులను తక్షణమే పోలీసులు వెనక్కి తీసుకుని, అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాల జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. మరోసారి ఎన్టీఆర్ విగ్రహాల జోలికివస్తే ఊరుకునేది లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ROAD ACCIDENT: టెంపో వ్యాన్​ను ఢీకొన్న ట్రాక్టర్.. తెలంగాణ వాసులకు గాయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.