మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు సందర్భంగా అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉన్మాద చర్యలను సంఘటితంగా ప్రజలు, తెదేపా కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ఇదే పోరాటపటిమ కనబర్చాలన్నారు.
సభ్య సమాజం తలదించుకునేలా జగన్ రెడ్డి తీరు, మంత్రుల భాష ఉందని విమర్శించారు. పోలీసులు తీరు మార్చుకుని ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే కాలమే సమాధానం చెప్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
వేడెక్కిన కృష్ణా జిల్లా రాజకీయం: కొడాలి వ్యాఖ్యలపై దేవినేని ఆందోళన..