తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆచూకీ తెలపాలంటూ డీజీపీకి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఉదయం అరెస్టు చేసిన బ్రహ్మం చౌదరి ఆచూకీ అర్ధరాత్రి అయినా తెలియకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బ్రహ్మంపై వైకాపా నేతలు, పోలీసులు కలిసి కుట్ర పన్నారనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశారు. బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, ముఖ్యమంత్రిదే భాధ్యతన్నారు. వైకాపా నేతలతో కుమ్మక్కై తెదేపా నేతల్ని ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బ్రహ్మం చౌదరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బంద్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై వైకాపా కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండింటిన అచ్చెన్నాయుడు(achennaidu).. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుర్మార్గపు చర్యలు తగవన్నారు. దాడికి నిరసనగా తెలుగుదేశం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్కు(state bundh) సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతోందని ఆక్షేపించారు. ప్రశ్నించే వారిని భయపెట్టి, వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్... చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇకనైనా వైకాపా తన తీరు మార్చుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.
ఇదీచదవండి.