కరోనా కష్టకాలంలో కొండకోనలు దాటి, దారి డొంక లేని గూడేలుకు వెళ్లి నిత్యావసర వస్తువులు అందిస్తున్న సీతక్క సేవలు అద్భుతమని... తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
వలస కూలీలకు అండగా నిలిచిన ఆమె తీరు అనిర్వచనీయమని అన్నారు. వివిధ రంగాల్లో సేవలందించి, చరిత్రలో నిలిచిన మహిళల గురించి విన్నాం.. చదివాం.. సీతక్కను కళ్లారా చూస్తున్నాం అని కితాబునిచ్చారు. భావితరాలకు సీతక్క మార్గదర్శి అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాళ్లు, గాజు సీసాలతో దాడి చేసుకున్న వైకాపా కార్యకర్తలు