వైకాపా పాలన రైతుల పాలిట శాపంగా మారిందని.. తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 90శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న గణాంకాలపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. ధాన్యం రైతులు ఎకరాకు రూ.8వేల నుంచి 10 వేలు నష్టపోతున్నారని విమర్శించారు. తెలంగాణతో పోల్చితే ఏపీ ప్రభుత్వం అతి తక్కువగా ధాన్యం సేకరణ చేస్తోందని.. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఆక్షేపించారు.
ఇదీ చదవండీ.. UNWTO Best Tourism Villages: 'బెస్ట్ టూరిజం విలేజ్' పోటీలో భూదాన్ పోచంపల్లి