ETV Bharat / city

వైకాపా పిరికితనం సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది : తెదేపా - ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వార్తలు

అసెంబ్లీలో తమ గొంతు నొక్కినా ప్రజల పక్షాన ధైర్యంగా పోరాడామనే తృప్తి మిగిలిందని తెదేపా శాసనసభ పక్షం అభిప్రాయపడింది. ప్రజలపై ప్రభుత్వం వివిధ మార్గాల్లో మోపాలనుకున్న ఆర్థిక భారాన్ని గట్టిగా వ్యతిరేకించామని ధీమా వ్యక్తంచేసింది. పెట్రోలు, డీజీల్ మీద వ్యాట్, రోడ్డు సెస్, మున్సిపల్ ఆస్తి పన్నుల బిల్లులను శాసనమండలిలో తమకున్న బలంతో అడ్డుకొని వెనక్కి పంపడంతో నైతికంగా విజయం సాధించామని ఆ పార్టీ నేతలు స్పష్టంచేశారు.

Tdp
Tdp
author img

By

Published : Dec 4, 2020, 10:57 PM IST

వైకాపా పిరికితనం సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది : తెదేపా

అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఐదు రోజుల పాటే జరిగినా ప్రజావాణిని బలంగా వినిపించామని ప్రతిపక్షం తెదేపా ధీమా వ్యక్తంచేస్తోంది. ప్రతి రోజూ సభ ప్రారంభానికి ముందు వివిధ ప్రజావ్యతిరేక అంశాలపై నిరసన ర్యాలీలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం ఒత్తిడి పెంచగలిగామని నేతలు అభిప్రాయపడ్డారు. మొదటి రెండు రోజులు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలనే సభలో ప్రభుత్వం చర్చకు తీసుకునేలా చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే తొలి రోజు రైతు సమస్యలపై తాము తీసుకున్న అంశం ప్రభుత్వం వైఫల్యాలను బహిర్గతం చేసిందన్నారు. పంటల బీమాకు సంబంధించి ప్రభుత్వం అవాస్తవాలతో తప్పుదోవ పట్టించాలని చూసినా, సస్పెన్షన్​కు కూడా వెనకాడకుండా ఒత్తిడి పెంచామన్నది తెలుగుదేశం నేతల భావన. టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వాన్ని వదలిపెట్టేది లేదని, అన్ని కెటగిరీల లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. రైతు సమస్యలు, టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకపోవడం, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, మున్సిపాలిటీ పన్నుల పెంపుపై ప్రజల్లోకెళ్లి పోరాడతామన్నారు. లక్ష రూపాయల ఇచ్చి ఇళ్లు అమ్ముకోవాలంటూ టిడ్కో లబ్ధిదారులకు కొందరు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించేలా చూస్తామని స్పష్టం చేశారు.

ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

శాసనసభ సమావేశాలు జరిగిన ఐదు రోజులూ తెదేపా సభ్యుల్ని సస్పెండ్‌ చేశారని చంద్రబాబు విమర్శించారు. ఏడాదిన్నర వ్యవధిలో చేసిన పనులు చెప్పలేని ‘ఫేక్‌ సీఎం’.. వైఫల్యాలను ప్రశ్నిస్తే భరించలేక ఎదురుదాడికి దిగి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌ ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి అని విమర్శించారు. వైకాపా పిరికితనం సమావేశాల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రభుత్వం 24 బిల్లుల్ని చర్చించకుండానే ఆమోదించుకుందని.. వాటితో ప్రయోజనమేంటని నిలదీశారు. చేసిన తప్పులు అంగీకరించి సీఎం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తొలిసారి చంద్రబాబు సస్పెండ్

తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు తొలిసారి స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడం సస్పెండ్​ అవడం వంటి పరిణామాలను తెలుగుదేశం నేతలు గుర్తు చేశారు. టిడ్కో ఇళ్లు పోలవరం వంటి అంశాల్లోనూ నైతిక విజయం తమదేనని స్పష్టంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలు బయట పడటంతోనే అర్ధరాత్రి పంటల బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లింపు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసిందని వివరించారు. మహిళలకు, చిన్నారులకు సంరక్షణకు సంబంధించిన దిశ బిల్లుపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను సీబీఐకి అప్పగించేలా చేయడం, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంశాల మీద గట్టిగా పోరాడామని నేతలు ధీమా వ్యక్తంచేశారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అసెంబ్లీ సమావేశాలతో వదలకుండా రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరడతామని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : గ్రేటర్‌ హైదరాబద్ ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.