అమూల్ సంస్థకు రూ.3వేల కోట్లను కట్టబెట్టే బదులు వంద కోట్లతో విజయ డెయిరీని అభివృద్ధి చేయవచ్చని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని డెయిరీలపై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 20 వరకు సహకార సంఘాల పాల డెయిరీలను కాదని... గుజరాత్‌కు చెందిన అమూల్‌కు ప్రాధాన్యమివ్వడమేంటని ప్రశ్నించారు. పాదయాత్రలో పాడి రైతులకు లీటర్‌కు 4 రూపాయలను బోనస్ ఇస్తామన్న హామీని జగన్ విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి