ETV Bharat / city

రాజ్యసభ ఎన్నికలు: వ్యూహాత్మకంగా వ్యవహరించిన ‘రెబల్స్‌’

వైకాపాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరిధర్ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్​ ప్రక్రియలో‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ ముగ్గురికీ తెదేపా విప్‌ జారీచేయడంతో ఓటింగ్‌కు హాజరయ్యారు.

tdp rebals-attend the rajyasabha elections
వ్యూహాత్మకంగా వ్యవహరించిన ‘రెబల్స్‌’
author img

By

Published : Jun 20, 2020, 8:08 AM IST

వైకాపాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న కరణం బలరాం, వంశీ, గిరిధర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ ముగ్గురికీ తెదేపా విప్‌ జారీచేయడంతో ఓటింగ్‌కు హాజరయ్యారు. విప్‌ ధిక్కరిస్తే చిక్కుల్లో పడతామని.. తెదేపా అభ్యర్థికే ఓటు వేసినా, చెల్లకుండా చేశారు. వంశీ, గిరిధర్‌ ఉదయమే సభకు చేరుకున్నా మధ్యాహ్నం వరకు ఓటు వేయలేదు. కరణం బలరాం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చారు.

పోలింగ్‌ కాసేపట్లో ముగుస్తుందనగా వారు ఓట్లు వేశారు. ఆ ముగ్గురిలో ఒక ఎమ్మెల్యే.. నాలుగో స్థానంలో ఉన్న వర్ల రామయ్య పేరు దగ్గర మొదలుపెట్టి పైవరకు పెద్ద టిక్‌ పెట్టినట్టు తెలిసింది. మిగతా ఇద్దరు తెదేపా అభ్యర్థి పేరు ఎదురుగా టిక్‌ పెట్టడంతో పాటు కొన్ని వ్యాఖ్యలు కూడా రాసినట్టు సమాచారం. ‘‘రాష్ట్రాన్ని దోచుకున్నారు. దోచుకోవడానికి ఇంకేం మిగిలింది?’’ అని ఒకరు, ‘‘గెలిచేటప్పుడు ధనికులకు, ఓడిపోయేటప్పుడు దళితులకా?’’ అని మరొకరు వ్యాఖ్యలు రాసినట్టు తెలిసింది.

ఇదీ చదవండి:

రాజ్యసభ ఎన్నికలు: నలుగురు వైకాపా అభ్యర్థులు విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.