ETV Bharat / city

tdp: ప్రజల స్వేచ్ఛను హరించి గెలిచారు - పరిషత్ ఎన్నికలపై తెదేపా స్పందన

స్థానిక ఎన్నికల ఫలితాలపై(parishath elections) తెదేపా నేతలు మండిపడ్డారు. పరిషత్‌ ఎన్నికల్లో అసలు తెదేపా పోటీనే చేయలేదని.. వైకాపా దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించిందని నేతలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెదేపా వదిలేసిన ఎన్నికల్లో.. గెలిచామని వైకాపా నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు

tdp
tdp
author img

By

Published : Sep 20, 2021, 7:14 AM IST

‘పరిషత్‌ ఎన్నికల్లో అసలు తెదేపా పోటీనే చేయలేదు. వైకాపా దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించింది. ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం మంత్రుల వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని తెదేపా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘అధికారులు, గూండాలు, పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం ఈ ఎన్నికల్లో అరాచకానికి పాల్పడింది. వైకాపా నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడి ప్రజల స్వేచ్ఛను, చివరకు ఓటు హక్కును హరించారు’ అని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలనాటినుంచి రోజురోజుకూ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వివరించారు. ‘దీనిపై మీరు కూడా సర్వే చేయించుకుంటున్నారు. అందుకే ప్రశాంత్‌ కిశోర్‌ను బతిమిలాడి పిలిపించుకుంటున్నారు. మీరు న్యాయంగా పాలిస్తుంటే మీ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. అలా కాదని పీకేని పిలిపించుకుంటున్నారంటేనే మీ దుస్థితేంటో అర్థమవుతోంది’ అని ఎద్దేవా చేశారు. తెదేపా వదిలేసిన ఎన్నికల్లో గెలిచామని వైకాపా నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శాసనసభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపాకు 25 సీట్లకు మించి రావని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

‘పరిషత్‌ ఎన్నికల సమయంలో తెనాలిలో తెదేపా అభ్యర్థి ఇంట్లో మద్యం సీసాలు పెట్టి అక్రమ కేసులు పెట్టారు. మాచర్లలో బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై దాడి చేశారు. పుంగనూరులో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుంటే గిరిజన మహిళ బురఖా వేసుకొని వెళ్లినా వైకాపావారు అడ్డుకుని ఆమెపై, ఆమె భర్తపై దాడి చేశారు. చంపుతామని బెదిరించారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళ్లపల్లిలో 72కి 72, శ్రీకాళహస్తిలో 64కి 63 ఎంపీటీసీ స్థానాలను వైకాపా బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది. రాష్ట్రం మొత్తం ఇదేలా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని మండిపడ్డారు.

మేం ప్రజల్ని మెప్పించి గెలిచాం

‘మేం అధికారంలో ఉండగా ఎన్నికలను పద్ధతిగా నిర్వహించి ప్రజలను మెప్పించి గెలిచాం. 2017లో 9ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే వైకాపా కేవలం 3స్థానాల్లోనే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మేమన్నీ గెలిచాం. కడప ఎమ్మెల్సీ స్థానాన్నీ కైవసం చేసుకున్నాం. నంద్యాల ఉపఎన్నిక, 2015లో గుంటూరు, కృష్ణా ఎమ్మెల్సీ ఎన్నికలనూ గెలిచాం. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 49 స్థానాలకుగాను 39 గెలిచాం. స్థానిక ఎన్నికల గురించి మాట్లాడే అర్హత కూడా వైకాపా నేతలకు లేదు’ అని దుయ్యబట్టారు.

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం తప్పదు

‘దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత అప్పట్లో స్థానిక ఎన్నికలతోపాటు ఉపఎన్నికలనూ బహిష్కరించారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఆమే విజయం సాధించారు. వైకాపా ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. పాపాలు పండాయి. ఈ రోజు మీ అరాచకాలను చూస్తున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో తప్పక సత్తా చూపిస్తాం’ అని అన్నారు.

ప్రజలు ఛీత్కరిస్తున్నా సంబరాలు: జీవీ ఆంజనేయులు

ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరిస్తున్నా.. వైకాపా నేతలు గెలిచామని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా అపహాస్యం చేసిందన్నారు. మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

అవి సెలక్షన్‌ తప్ప ఎలక్షన్‌ కావు: అచ్చెన్నాయుడు

స్థానిక ఎన్నికల ఫలితాలు వైకాపా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని వెల్లడించదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇవి బోగస్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలన్నారు. జరిగింది సెలక్షనే తప్ప ఎలక్షన్‌ కావని వెల్లడించారు. వైకాపా నేతలు ఏం ఉద్ధరించారని ప్రజలు ఏకగ్రీవంగా పట్టం కడతారని ప్రశ్నించారు. ఒకవేళ ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయంగానే భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? అని ఆదివారం ప్రకటనలో ప్రశ్నించారు. ‘పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఎలా అపహాస్యం చేసిందో దేశమంతా చూసింది. తెదేపా అభ్యర్థులపై దౌర్జన్యాలకు దిగి నామినేషన్లు వేయకుండా అడ్డుకొని పోలీసుల సాయంతో ఏకగ్రీవాలు చేసుకున్నారు. వైకాపాకు ఓటేయకపోతే గ్రామాల్లో ఉండలేరని, సంక్షేమ పథకాలు రద్దవుతాయని, అక్రమ కేసులు బనాయిస్తామని ప్రజలను బెదిరించారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేసినందుకే తెదేపా ఎన్నికలను బహిష్కరించింది’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

parishat elections results: పరిషత్తు ఏకపక్షమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.