ఇదీ చదవండి :
వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్ నడక
రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని.. అసెంబ్లీకి రివర్స్‌లో నడిచి వెళ్లి నిరసన తెలిపారు తెదేపా నేతలు. ఇష్టారాగ్యంగా వ్యవహరిస్తున్నారని నిరసనలో పాల్గొన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా చర్యల వలన పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని విమర్శించారు.
వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్ నడక
సీఎం జగన్ చర్యలతో రాష్ట్రం అధోగతిపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. టెండర్లన్నీ రిజర్వ్ చేసుకుని రివర్స్ అంటున్నారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి.. విదేశీ పెట్టుబడులు రాని దుస్థితి తీసుకువచ్చారన్న చంద్రబాబు... ఉన్న పరిశ్రమలు పారిపోయే స్థితి ఉందని ఆరోపించారు. రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై తెదేపా నిరసన ర్యాలీ చేసింది. చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టిన నేతలు వెనక్కి నడుస్తూ తమ నిరసన తెలిపారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేస్తూ వెళ్లారు.
ఇదీ చదవండి :