ETV Bharat / city

కళా అరెస్టుపై ఆగ్రహ జ్వాలలు... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

author img

By

Published : Jan 21, 2021, 8:13 PM IST

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్​కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని మండిపడ్డారు. వైఫల్యాలను ప్రశ్నించినందుకే దాడులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

tdp  protest across the state against  kala venkatrao arrest
కళా అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన

ప్రతిపక్ష నేతలపై వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెదేపా నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్​కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వారు రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలిపారు.

రాష్ట్రంలో పోలీసు పాలన

తెదేపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అరెస్ట్​కు నిరసనగా విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తెదేపా నిరసన చేపట్టింది. సూర్యమహల్ కూడలి వద్ద పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకుడు పెడిరెడ్డి చిట్టిబాబు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని విమర్శించారు. అనకాపల్లిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నడుస్తున్న ఆటవిక పాలనకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. విశాఖలోనూ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అక్రమ అరెస్టులతో పరిపాలన చేయాలని చూస్తోందని ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. చీడికాడ - చోడవరం ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

రాక్షస పాలన

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని రమణమూర్తి ఆరోపించారు. ఆమదాలవలసలో గాంధీ విగ్రహం వద్ద తెదేపా అధికార ప్రతినిధి తమ్మినేని విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ బాబును రామయ్యపుట్టుగలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నీ పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. పాలకొండ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ బొమ్మ కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజాంలో తెదేపా శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు.

కక్ష సాధింపు చర్యలు

కృష్ణా జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెదేపా నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కృష్ణా జిల్లా చందర్లపాడులో పార్టీ శ్రేణులు నిరనస చేపట్టారు. స్థానిక కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ప్రతిపక్ష నాయకులపై వేధింపులు మానుకోవాలని కంచికచర్లలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. నందిగామ గాంధీ సెంటర్​లో జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు, తెలుగు మహిళ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెదేపాపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా అరెస్టులు చేస్తోందని కృష్ణా జిల్లా కార్యదర్శి సాంబశివ రావు అన్నారు.

ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి

తెలుగుదేశం నాయకుల అరెస్టులను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఆ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. 42 వ నంబర్ జాతీయ రహదారిపై ఇందిరాగాంధీ కూడలిలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఇలాంటి చర్య అప్రజాస్వామికమన్నారు. అనంతపురంలోనూ నిరసన జరిగింది. పెనుకొండలో తెదేపా నాయకులు గాంధీ కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. సోమప్ప కూడలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలులో తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు.

సీఎం రాజీనామా చేయాలి

రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో మండల పార్టీ అధ్యక్షుడు దేవ సుందరం నేతృత్వంలో పార్టీ నేతలు నిరసనకు దిగారు. మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ బాధ్యులు డి. రమేష్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. మరోవైపు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. నగరంలోని విఆర్సీ సెంటర్ వద్ద పార్టీ నేతలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

ఒంటి కాలిపై నిరసన

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో తెదేపా కార్యకర్తలు ఒంటికాలిపై నిరసన చేపట్టారు. అంతకు ముందు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ... పామూరు బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ చేశారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో తెదేపా నిరసనలు హోరెత్తాయి. రాజోలు నియోజకవర్గం మామిడికుదురులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు నేతలు. అమలాపురంలో మాజీ శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన చేశారు. రాజమహేంద్రవరంలో తెదేపా నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. పి.గన్నవరంలో మూడు రహదారుల కూడలిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట తెదేపా కార్యకర్తలు నిరసన తెలిపారు.

డీజీపీ క్షమాపణ చెప్పాలి

గుంటూరులో తెదేపా నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు అత్యుత్సాహంతో అక్రమ అరెస్ట్​లు చేయడం సరికాదని గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. వైకాపా నాయకుడిలా వ్యవహరిస్తున్న డీజీపీ తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రత్తిపాడులోనూ తెదేపా నాయకులు రోడ్డెక్కారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో తెదేపా ధర్నా చేసింది. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే భాంజు దేవ్ నిరసన తెలిపారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేట పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కమలాపురంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సాయినాధ్ శర్మ, నాయకులు నిరసన చేపట్టారు. తెదేపా కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్​కు వినతి పత్రం ఇచ్చారు.

ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 139 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.