రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు.. పంట అమ్మకాలకు వస్తున్నాయా.. అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోందని విమర్శించారు. కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోయటం ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటీ దారుణం అంటూ సంబంధిత వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి..