అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, 40 ఏళ్ల పార్టీ ఆవిర్భావ వేడుకలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు తదితర అంశాలే ప్రధాన అజెండాగా.... తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఇవాళ ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం కానుంది. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలా..? వద్దా అనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.
వివేకా హత్య కేసులో తెలుగుదేశంపై వైకాపా అసత్య ఆరోపణలు చేస్తున్నందున... సీఎం జగన్ వ్యవహారశైలిని ప్రజా క్షేత్రంలో ఎలా ఎండగట్టాలనే అంశంపైనా చర్చ జరగనుంది. రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అంశంపై నేతలు చర్చించనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పతనం, అక్రమ మైనింగ్, ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం, సంక్షేమ పథకాలకు నిధులు కోత, పంచాయతీల నిధులు దారి మళ్లింపు, అనధికారిక విద్యుత్ కోతలు –విద్యుత్ ఛార్జీల పెంపు, ఓటీఎస్ వసూళ్లు, పాఠశాలల విలీనం, అమరావతి – రాష్ట్ర వ్యాప్త చైతన్య కార్యక్రమాలు, కొత్త జిల్లాల విభజన సమస్యలు, పోలవరం పూర్తి తదితర 10కి పైగా అంశాలు అజెండాలో చేర్చినట్లు తెలుస్తోంది
ఇదీ చదవండి: