151 సీట్లు గెలుచుకున్న బలమైన నాయకుడు 15నెలల్లోనే బలహీనపడ్డాడని తెదేపా అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలో, వద్దో అనేదానిపై రెఫరెండంకు సీఎం జగన్ స్పందించలేదని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ముందుకు రావడానికి ముఖం చాటేసి.. తన భావాలను ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారని దుయ్యబట్టారు.
గతంలో గోవా, డయ్యూ-డామన్కి సంబంధించి 1966లో రెఫరెండం నిర్వహించేలా పార్లమెంట్లో చట్టం చేశారన్న పట్టాభి.. గోవాను మహారాష్ట్రలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తే.. స్థానికులు ఆనాటి ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా ఉద్యమించారని గుర్తు చేశారు. ఏపీలోనూ ఒక రెఫరెండం పెట్టాలని జగన్ కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేశారు. తోకముడిచి పారిపోవడంలో జగన్ పేటెంట్ రైట్స్ పొందారని.. రాయలసీమ పౌరుషానికి కట్టుబడేవారైతే రెఫరెండంకు ముందుకు రావాలని సవాల్ చేశారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు