ETV Bharat / city

'రహస్య ఒప్పందాలు మానండి.. విశాఖ ఉక్కు పరిరక్షణకు ముందుకు రండి' - tdp on vishaka steel plant

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అరాచకాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. లెక్కల్లో చూపని నిధుల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కొవిడ్ కట్టడికి కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వాడలేదని తెలుగుదేశం ఎంపీలు విమర్శించారు. వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. అంతరాష్ట్ర జలవివాదంపై కేంద్రం జోక్యం కోరతామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడతామన్నారు.

tdp
tdp
author img

By

Published : Jul 17, 2021, 7:26 AM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల మాఫియాను చూశామని, ఇప్పుడు సీఎం జగన్‌ బాక్సైట్‌ అక్రమ తవ్వకాల ద్వారా రూ.15వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరతీశారని తెదేపా ఎంపీలు ధ్వజమెత్తారు. బాక్సైట్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పార్లమెంటులో డిమాండ్‌ చేస్తామని తెలిపారు. జగన్‌ అంతర్గతంగా పోస్కో వంటి ప్రైవేటు సంస్థలతో బేరాలు కుదుర్చుకుంటూ.. బయటకు మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పదవులన్నింటికీ రాజీనామాలు చేద్దామని వైకాపా నాయకులు చెబితే.. తెదేపా రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. సమావేశం వివరాలను ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌ వివరించారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్‌ పాల్గొన్నారు.

అధికారుల కోసం మాట్లాడుకుంటున్నారు కదా?

తెలంగాణ నుంచి కావలసిన అధికారుల్ని డిప్యుటేషన్‌పై తెచ్చుకోవడానికి.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో రాత్రికి రాత్రే మాట్లాడి పనులు చక్కబెట్టుకుంటున్నప్పుడు జలవివాదంపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా ఎంపీలు ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయి, రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి, ప్రధానికి లేఖలతో సరిపెడుతున్నారు. దీనిపై కేంద్ర జోక్యం చేసుకోవాలి’ అని తెలిపారు.

రఘురామపై అనర్హతే ఏకైక ఎజెండా

‘వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేసేలా ప్రయత్నించడమే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వైకాపా పెట్టుకున్న ఏకైక ఎజెండా. అది తప్ప, రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశంపైనా పోరాడేందుకు సిద్ధంగా లేరు’ అని మండిపడ్డారు.

ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం ఇలా..

  • జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా విజృంభణ, ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం, కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధుల దారిమళ్లింపు, మృతుల సంఖ్యను తక్కువగా చూపడం, కరోనా ప్యాకేజీ ఇవ్వకపోవడంపై ప్రస్తావించాలి.
  • ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేయడం, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వంటి అంశాల్ని లేవనెత్తాలి.
  • మాన్సాస్‌ట్రస్టుపై కక్షసాధింపును ప్రస్తావించాలి.
  • కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడికి పాల్పడటం, తెదేపా శ్రేణుల్ని అక్రమ కేసులతో వేధించడంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదుచేయాలి.

కేంద్ర నిధులను దారి మళ్లించడాన్ని ప్రస్తావిస్తాం

‘పథకాల అమలుకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోంది. రాష్ట్రంలో జరిగే వ్యవహారాల్ని, ఆర్థిక ఉగ్రవాదాన్ని, అరాచకత్వాన్ని, రాష్ట్రాన్ని అప్పులతో అథోగతిపాల్జేసి, ఉద్యోగాలకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తేవడాన్ని పార్లమెంటు వేదికగా కేంద్రం దృష్టికి తెస్తాం. కేంద్రాన్ని తప్పుదారి పట్టించి రూ.41 వేల కోట్లు దారి మళ్లించడం, రూ.1.70 లక్షల కోట్ల అప్పులు చేయడంపై ప్రస్తావిస్తాం’ అని తెదేపా ఎంపీలు పేర్కొన్నారు’ అని తెలిపారు. ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, రవీంద్రకుమార్‌తో పాటు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.