విద్యార్థి లోకం తిరగబడితే సీఎం జగన్ తాడేపల్లి కోట నుంచి అడుగు బయటపెట్టలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దని ఆయన హితవు పలికారు. జీఓ77 ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని.. ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని ముఖ్యమంత్రి నిర్వీర్యం చేశారని లోకేశ్ దుయ్యబట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జీఓ 77 తీసుకొచ్చారని విమర్శించారు. కేసులు వెంటనే ఉపసంహరించుకుని జీఓ77 ని రద్దు చేయాలని, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: