ETV Bharat / city

TDP MP Rammohan Naidu: "ఏపీలో లిక్కర్‌ మాఫియా చెలరేగిపోతోంది"

TDP MP Rammohan Naidu: రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా చెలరేగిపోతోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.

TDP MP Rammohan Naidu
TDP MP Rammohan Naidu
author img

By

Published : Mar 16, 2022, 3:33 PM IST

TDP MP Rammohan Naidu: రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా చెలరేగిపోతోందని.. నాటుసారా తాగి ప్రజలు ప్రాణాలు పోతున్నాయని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో ఇటీవల సారా సేవించి 18 మంది మృతి చెందారని గుర్తుచేశారు.

TDP MP Rammohan Naidu

"2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్..తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మద్యపాన నిషేధం అమలు చేయకపోగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. మద్యం ధరలు సైతం విపరీతంగా పెంచేసింది. రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా, మద్యం బ్లాక్‌మార్కెటింగ్‌ చెలరేగిపోతున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 18 మంది చనిపోయారు. దీనిపై తక్షణం స్పందించిన మా అధినేత చంద్రబాబు.. అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తక్షణం కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుని.. రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలి." -రామ్మోహన్‌నాయుడు, తెదేపా ఎంపీ

TDP MP Rammohan Naidu: ఈ విషయంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిసారించి.. ప్రజల ప్రాణాలు కాపాడాలని రామ్మోహన్‌నాయుడు కోరారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి జగన్​కు సోము వీర్రాజు బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.