ETV Bharat / city

MLC MANTHENA: టీకా పంపిణీలో రాష్ట్రం అట్టడుగున ఉంది..

author img

By

Published : Sep 24, 2021, 12:22 PM IST

సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థతతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి కరోనా మొదటి, రెండో దశల్లో ప్రజల భారీ మూల్యం చెల్లించుకున్నారన్నారు.

TDP leader,mlc Mantena Satyanarayana Raju
తెదేపా నేత ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు

కరోనా కేసుల పెరుగుదలలో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందన్న ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. టీకా పంపిణీలో మాత్రం దేశంలోనే అట్టడుగున ఉందని విమర్శించారు. వ్యాక్సినేషన్​లో ముందున్నామని ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో టీకా పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోందన్నారు.

రాజకీయ కక్షసాధింపు చర్యలకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయలు శూన్యమని వ్యాఖ్యానించారు. ఫ్రంట్ లైన్స్ వారియర్స్ ను ప్రభుత్వం వైద్య సేవలకు వాడుకుని రోడ్డున పడేసిందన్నారు. వేతనాల కోసం ఆందోళనలు చేస్తే లాఠీచార్జ్​లు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు.

ఇదీ చదవండీ.. EX MLA DEAD: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.