ETV Bharat / city

'వాటాలు కుదరకే.. ఇళ్ల స్థలాల అమ్మకం మరోసారి వాయిదా' - ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వ్యాఖ్యలు

వైకాపా నేతల మధ్య వాటాలు కుదరకే.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల 'అమ్మకం' మరోసారి వాయిదా పడిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం పేదలను దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్​.. చంద్రబాబుపై కక్షతోనే 6 లక్షల ఇళ్ల పంపిణీ నిలిపేశారని మండిపడ్డారు.

'వాటాలు కుదరకే.. ఇళ్ల స్థలాల అమ్మకం మరోసారి వాయిదా'

author img

By

Published : Jul 6, 2020, 2:30 PM IST

వైకాపా నేతలు ఇళ్ల స్థలాల పేరుతో దోచుకున్న సొమ్ములో వాటాలు కుదరకే.. పంపిణీ ప్రక్రియ మరోసారి వాయిదా పడిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు పేదల నుంచి రూ.20 వేల నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బుద్ధా డిమాండ్​ చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబుకు పేరొస్తుందనే.. రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల ఇళ్ల పంపిణీ నిలిపివేసిందని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్​ కక్ష పెంచుకుంది చంద్రబాబుపై కాదని.. 6 లక్షల మంది లబ్ధిదారులపై అని ఎద్దేవా చేశారు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో భవంతులు నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి.. పేదలకు ఇళ్లు కేటాయించకుండా వారిని వేధిస్తున్నారని బుద్ధా విమర్శించారు.

ఇదీ చూడండి..

జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.