"అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడేవారి ఆదేశాలు అమలు చేస్తే, అధికారులకూ ఇబ్బందులు తప్పవు" అని ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. "అఖిల భారత సర్వీస్ అధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ తమను తాము కాపాడుకోవాలి. జగన్ రెడ్డి తన నేర స్వభావంతో కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నారని అధికారులు గ్రహించాలి. వైఎస్ఆర్ హయాంలో జగన్ రెడ్డికి సహకరించిన అనేక మంది అధికారులు జైలుకెళ్లారు. తాజాగా.. హైకోర్టు గిరిజాశంకర్, చిరంజీవి చౌదరిలకు విధించిన శిక్ష అందరికీ కనువిప్పు కావాలి. మునుపెన్నడూ లేని విధంగా అఖిలభారత సర్వీసు అధికారులు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో గ్రహించాలి" అని సూచించారు.
ఇదీ చదవండి:
Janasena: అన్యాయాలు జరిగితే ఎదుర్కొనేందుకు వెనుకాడబోం: పవన్ కల్యాణ్