MLC ASHOK BABU : ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలో సంక్షేమం జరిగి ఉంటే.. తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇచ్చి 3 రూపాయలు లాక్కుంటున్నారనేది ప్రజలకు కూడా అర్ధమైందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 129 పథకాల్లో 123 పథకాలు అమలు చేసినట్లు అంకెల గారిడీ చేశారని ధ్వజమెత్తారు. మూడేళ్లలో 1.36లక్షల కోట్ల రూపాయలను 1.67 కోట్ల కుటుంబాలకు నగదు బదిలీ చేసినట్లు అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు.
కులాల వారీగా సంక్షేమం అమలు చేసి మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. నవరత్నాలను కులాల వారీగా విడదీసి చూపుతూ ఆయా సామాజిక వర్గానికి ప్రత్యేకంగా లబ్ది చేకూర్చినట్లు చెప్పటం మోసగించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో కులానికి గతంలో చేకూరిన లబ్దితో పోల్చితే ఇప్పుడు అందేది చాలా తక్కువ అని ఆక్షేపించారు. బడ్జెట్ పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. చేసిన రూ.5లక్షల కోట్ల అప్పు ఏమైందని అశోక్‌బాబు ప్రశ్నించారు.
ఇవీ చదవండి: