ETV Bharat / city

రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు తెదేపా లేఖ.. జోగి రమేశ్‌పై చర్యలకు విజ్ఞప్తి - చంద్రబాబు ఇంటిపై దాడి తాజా వార్తలు

tdp letter to pm
tdp letter to pm
author img

By

Published : Sep 29, 2021, 6:16 PM IST

Updated : Sep 29, 2021, 8:56 PM IST

18:13 September 29

రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు రాష్ట్రవ్యాప్త తెదేపా నేతల ఫిర్యాదు

చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గ్రామ కమిటీల్లో తీర్మానం చేసి సంతకాలు చేసిన లేఖలను తెలుగుదేశం నేతలు వారికి పంపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అరాచకాలు ఎక్కువయ్యాయని వివరించారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలపై వేధింపులు పెరిగాయని ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతల గృహ నిర్బంధాలు.. ప్రశ్నిస్తే దాడులు, వేధింపులు, బెదిరింపులు పెరిగాయన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి.. సీఎం, డీజీపీ మద్దతుందని జోగి రమేశ్ బహిరంగంగా చెప్పారని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి.. డీజీపీని రీకాల్ చేయాలని కోరారు.  

'జగన్ దర్శకత్వంలో దాడి జరగడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. దాడి విషయమై జోగి రమేశ్ ముందే ప్రకటించారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకపోగా వత్తాసు పలికారు. ప్రజా సమస్యలపై తెదేపా నిరసనలు తలపెడితే అక్రమ అరెస్టులు చేశారు. వైకాపా నేతల దాడులపై సమాచారం ఉన్నా పోలీసులు చర్యలు చేపట్టలేదు. హింసాత్మక రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. దాడికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను పునరుద్ధరించాలి'- తెదేపా నేతలు

ఇదీ చదవండి: 

CC FOOTAGE: చంద్రబాబు నివాసానికి భారీగా జోగి రమేశ్​​ అనుచరులు..సీసీ టీవీ దృశ్యాలు

Last Updated : Sep 29, 2021, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.