ETV Bharat / city

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

author img

By

Published : Dec 11, 2019, 7:37 PM IST

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ ధర్నా చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్లు ఎదుట తెలుగుదేశం శ్రేణులు ఆందోళనకు దిగారు. సచివాలయం వద్ద తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు

tdp leaders protest for hike of rtc charges
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

ఆర్టీసీ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనలు చేశారు. చార్జీలు తగ్గించాలంటూ పలు చోట్ల ధర్నాకు దిగారు.

కృష్ణా, గుంటూరులో
ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అమరావతిలోని సచివాలయం ఎదుట తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మంగళగిరి నుంచి సచివాలయం బస్టాండ్ వరకు తెదేపా నేతలు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఎన్నికల ముందు ఏం పెంచమని చెప్పిన జగన్... ఇప్పుడు రోజుకో సమస్యను ప్రజలపై మోపుతున్నారని దుయ్యబట్టారు. గుంటూరు బస్టాండ్‌ ఎదుట తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. అన్ని హామీల మాదిరిగానే ఆర్టీసీ ఛార్జీల విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.

కృష్ణా జిల్లాలో
ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి నుంచి మైలవరం వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సు ఛార్జీల పెంపు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ ఆటోనగర్ వద్ద మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ నేతృత్వంలో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. నందిగామలో నేతలు, నాయకులు ధర్నా నిర్వహించారు.

చిత్తూరులో
తిరుపతి బస్టాండ్ ఎదుట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఎలాంటి ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన జగన్‌... 6 నెలల్లోనే మాటతప్పారని మండిపడ్డారు. మదనపల్లె ఆర్టీసీ బస్టాండు ఎదుట నిరసన తెలిపారు.

కర్నూలు, ప్రకాశం, నెల్లూరులో
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బస్టాండ్ ఎదుట తెలుగుదేశం శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. నెల్లూరులో బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు.

కోస్తాంధ్ర జిల్లాలో

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెలుగుదేశం నేతలు ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ గేటు వద్ద అడ్డుగా నిల్చుని తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపాయి. విశాఖ మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద రాస్తారోకో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తకోటలోనూ ఆందోళన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టారు.

ఇదీ చూడండి: 'ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి'

Intro:AP_ONG_13_11_TDP_DHARNA_RTC_CHARGES_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
......................................
పెరిగిన ఆర్టీసీ చార్జీలకు తగ్గించాలని కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర తెదేపా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే ఉల్లి ,నిత్యావసర వస్తువుల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఆర్టీసీ చార్జీలు భారం అవుతున్నాయని తెలిపారు. అధికారం లోకి రాకముందు ఆర్టీసీ చార్జీలు పెంచమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చార్జీలు పెంచి ప్రజలను మోసంచేసారని తెదేపా నాయకులు విమర్శించారు. ....బైట్
రాజ్ విమల్, తెదేపా నాయకుడు.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.