ఉపాధి హామీ బిల్లులను చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం నీచ సంస్కృతికి తెర తీసిందని తెదేపా నేతలు ఆరోపించారు. బిల్లుల అంశంపై శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి కళా వెంకట్రావ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడినే నేతలు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. తెదేపా పాలనలో జరిగిన ఉపాధి పనుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిధులను ఆపుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీతో పాటు ఇళ్లు, నీటి సంఘాల నిధులను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు లేఖ ఇచ్చేందుకు వచ్చామని.. కానీ కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా అధికారులు పని చేయాలని హితవు పలికారు.
ఇదీ చదవండి
Payyavula Keshav: రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారు: పయ్యావుల