ETV Bharat / city

MLC Ashok Babu Arrest: అశోక్‌బాబు అరెస్ట్‌పై తెదేపా నేతల ఆందోళన..పలువురు అరెస్ట్​ - తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు తాజా వార్తలు

తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఖండించారు. జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినందునే.. అందరినీ పంపాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన పలువురు తెదేపా నేతలకు పోలీసులు అరెస్ట్​ చేశారు.

tdp leaders arrest
tdp leaders arrest
author img

By

Published : Feb 11, 2022, 9:34 AM IST

Updated : Feb 11, 2022, 12:20 PM IST

అశోక్‌బాబు అరెస్ట్‌పై తెదేపా నేతల ఆందోళన..పలువురు అరెస్ట్​

Chandrababu on Ashok babu arrest: ఎమ్మెల్సీ ఆశోక్​బాబు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​లు తీవ్రంగా ఖండించారు. ఎపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. సర్వీస్ మేటర్స్​లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు దుయ్యబట్టారు. జ‌గన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

Lokesh on Ashokbabu Arrest: అర్ధరాత్రి అక్రమంగా అశోక్ బాబును అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం అశోక్ బాబు పోరాడుతున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. పార్టీ అశోక్ బాబుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అశోక్ బాబు న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు

ఎమ్మెల్సీ అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయం వద్దకు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు చెబితేనే కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

అశోక్​బాబు అరెస్ట్​ సమాచారం తెలుసుకుని పలువురు తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అశోక్​బాబును కలుసుకునేందుకు దేవినేని ఉమతో పాటు పలువురు తెదేపా నేతలు రాగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమతో పాటు.. తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తిలను అరెస్ట్​ చేశారు. అశోక్​బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా కొట్టారన్న నేతలు.. అందుకే అశోక్​బాబును చూపించాలని డిమాండ్​ చేస్తున్నామన్నారు.

'అర్ధరాత్రి దొంగల్లా అరెస్ట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది?'

అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన సీఎం జగన్ .. అరాచకంతో పాలన సాగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్​బాబు, ఆలపాటి రాజా, సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. వైకాపా వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన తెదేపా నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో ‎వేధిస్తున్నారని మండిపడ్డారు. అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయటాన్ని ఖడిస్తున్నట్లు తెలిపిన నేతలు.. అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. గతంలో అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. వైకాపా ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యంవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు భయపడేవారెవరూ తెదేపాలో లేరని... అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఇకనైనా పద్దతి మార్చుకుని పాలన సాగించకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఖండించారు. రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడం వల్లే ఎమ్మెల్సీ అశోక్ బాబును ప్రభుత్వం అరెస్టు చేయించిందని మండిపడ్డారు. అక్రమ కేసులతో కాపుల గొంతునొక్కాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు.

చీకటి ప్రభుత్వం అన్నీ చీకట్లోనే చేస్తుంటుంది: పట్టాభి

ఉద్యోగుల పక్షాన మాట్లాడటమే అశోక్‌బాబు చేసిన నేరమా? అని పట్టాభిరాం.. వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అరెస్టుల పర్వం మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి అశోక్‌బాబును అరెస్టు చేస్తారా? అని ప్రశ్చించిన ఆయన.. చీకటి ప్రభుత్వం అన్నీ చీకట్లోనే చేస్తుందని ఎద్దేవా చేశారు. జనవరి 25కు, ఫిబ్రవరి 10కి అదనంగా 4 సెక్షన్లు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు దుర్మార్గం: యనమల

ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని.. ముగిసిపోయిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వాన్ని తెదేపా సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని.. తక్షణమే కేసు ఉపసంహరించుకుని అశోక్ బాబును విడుదల చేయాలని డిామాండ్ చేశారు.

జీజీహెచ్ వంతెన వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు

గుంటూరులోని జీజీహెచ్​ వంతెన వద్ద తెదేపా నాయకులను సీఐడీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు నిలిపేశారు. పోలీసుల ఆంక్షలతో తెదేపా నాయకులు నక్కా ఆనంద్‌బాబు, న్యాయవాది తెనాలి శ్రావణ్ కుమార్ అక్కడి నుంచి వెనుదిరిగారు. తమను అనుమతించాలని.. ఆందోళన చేస్తున్న వారిని తెలుగు యువత నాయకులు మల్లేశ్వరరావు, రావిపాటి సాయికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:

MLC Ashok Babu Arrest: ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌.. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు

Last Updated : Feb 11, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.