TDP Leaders Meet Guntur Urban SP Arif Hafeez: మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. ఆ పార్టీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్, తదితరులు ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
గత నెల 19న దాడి ఘటన జరిగిందని.. ఇప్పటి వరకు ఆ దాడికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. బద్రినాధ్పై దాడికి సంబంధించిన కేసు మాత్రమే పోలీసులు నమోదు చేశారని గుర్తు చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. పోలీసులు పట్టించుకోకపోతే ప్రైవేటు కేసులు పెడతామని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి..: Lokesh On Panchayat Funds Transfer Issue: ఆ నిధులను తక్షణమే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి: లోకేశ్