వెలిగొండ ప్రాజెక్టు వల్ల నెల్లూరు, కడప జిల్లాలకు కూడా లబ్ధి కలుగుతుందని.. తెదేపా నేతలు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసి అన్ని వివరాలు చెప్పామని.. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వెలిగొండ వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని.. వెలిగొండ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
"వెలిగొండ గురించి వైకాపా ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రాజెక్టు ఉనికిని వైకాపా ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. వెలిగొండపై రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో ఒత్తిడి చేయడం లేదు?. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానిది మొద్దు నిద్ర. ప్రాంతీయ విభేదాలు పక్కనపెట్టి వెలిగొండ పూర్తి చేయాలి. ప్రాజెక్టు గురించి కేంద్రమంత్రికి అన్ని వివరాలు చెప్పాం. న్యాయం చేస్తామని షెకావతి హామీ ఇచ్చారు."- తెదేపా నేతలు
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు వీరాంజనేయస్వామి, రామారావు , మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి:
Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి