వైకాపా నాయకుల వేధింపులతో మొన్నటివరకూ ఎస్సీలను బలిచేసి.. ఇప్పుడు మైనార్టీలపై పడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారులను సస్పెండ్ చేసినట్లు, కేసు పెట్టినట్లు సీఎం జగన్ ఆడేవన్నీ నాటకాలని దుయ్యబట్టారు. నామమాత్రపు సెక్షన్లు పెట్టి ప్రజా సంఘాల వ్యతిరేకత చూశాక బెయిల్ రద్దుకు అప్పీల్ చేయడం జగన్నాటకమేనని ఆరోపించారు. సలాం తరహాలో రాష్ట్రంలో వేలాదిమంది ఉన్నారన్నారు. సలాం కుటుంబానికి అండగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాందోళనలు చేపట్టామని వివరించారు.
నంద్యాల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల కాల్ డేటా బహిర్గతం చేసి వారిని సర్వీసుల నుంచి తొలగించాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ తరహాలో సలాం కుటుంబసభ్యులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సెల్ఫీ వీడియో లేకపోతే కుటుంబ కలహాలతో సలాం చనిపోయినట్లు చిత్రీకరించేవారని దుయ్యబట్టారు. అరాచకాలను అరికట్టడంలో విఫలమైన డీజీపీ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని..., ముస్లిం సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు : లోకేశ్
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులకు అంతేలేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సలాం కుటుంబాన్ని వెంటాడి, హింసించి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడేలా చేసి ఇప్పుడు పరిహారం ప్రకటించారని విమర్శించారు. ఆత్మహత్యలకు కారణమైన వారిని కాపాడే ప్రయత్నాలు ఆపి కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
బంగారు భవిష్యత్తు ఉన్న 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడిని సీఎం ప్రకటించిన 25 లక్షల రూపాయలు బతికిస్తాయా అని నిలదీశారు. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌ను మండలిలోనే ఘోరంగా అవమానించటంతో పాటు రాజమహేంద్రవరంలో తన కూతురిని వేధించిన వారిపై ఫిర్యాదు చేసిన తండ్రి సత్తార్ ఎస్పీ కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నం చేశారని గుర్తు చేశారు.
-
కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే పనిగా పెట్టుకున్నారు @ysjagan.అడ్డంగా నరికేసి..అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం వైకాపా సర్కారుకి అలవాటుగా మారింది.నంద్యాలలో ముస్లిం మైనారిటీ అబ్దుల్ సలాం కుటుంబాన్ని వెంటాడి హింసించి..(1/4) pic.twitter.com/rzbZUt9jZY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే పనిగా పెట్టుకున్నారు @ysjagan.అడ్డంగా నరికేసి..అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం వైకాపా సర్కారుకి అలవాటుగా మారింది.నంద్యాలలో ముస్లిం మైనారిటీ అబ్దుల్ సలాం కుటుంబాన్ని వెంటాడి హింసించి..(1/4) pic.twitter.com/rzbZUt9jZY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 10, 2020కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే పనిగా పెట్టుకున్నారు @ysjagan.అడ్డంగా నరికేసి..అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం వైకాపా సర్కారుకి అలవాటుగా మారింది.నంద్యాలలో ముస్లిం మైనారిటీ అబ్దుల్ సలాం కుటుంబాన్ని వెంటాడి హింసించి..(1/4) pic.twitter.com/rzbZUt9jZY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 10, 2020
ఇదీ చదవండి