వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ వేదికగా మద్దతు పలికిన వైకాపా.. ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తోందంటూ తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై వైకాపా ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు మాట్లాడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
"రైతుల పట్ల వైకాపాది కపట ప్రేమ. తన కేసుల మాఫీ కోసం రైతుల ప్రయోజనాలను జగన్ దిల్లీలో తాకట్టు పెట్టారు. తెదేపా నాడు ప్రతిపాదించిన సవరణలనే నేడు కోరుతోంది. జే-టర్న్ తీసుకున్న వైకాపా నేతలు వంకర టింకరగా వ్యవహరిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు
వైకాపా పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపి ఇప్పుడు నాటకాలు ఆడుతోందని అయ్యన్నపాత్రుడు అన్నారు. తెదేపా ఆనాడే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.
"కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఉపయోగపడేలా ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులకు భాజపా ప్రభుత్వం కావాలనే అన్యాయం చేసింది." -పీతల సుజాత, మాజీ మంత్రి
ఇదీ చదవండి: ఏలూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి తెదేపా ఫిర్యాదు