ETV Bharat / city

అందరిదీ ఒకటే మాట.. 'వైకాపా అరాచక పాలన చేస్తోంది' - వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతల విమర్శల వార్తలు

వైకాపా ప్రభుత్వ తీరు, సీఎం జగన్ పరిపాలనపై తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, రాజధాని మార్పు, తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు, సంక్షేమ పథకాల పేరుతో మోసం, ఇసుక దోపిడీ లాంటి చర్యలతో రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

tdp leaders fires on ycp government
వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు
author img

By

Published : Jun 25, 2020, 10:46 PM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు మండిపడ్డారు. దేవినేని ఉమామహేశ్వరరావు, బీదా రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, బచ్చులు అర్జునుడు తదితరులు సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ అరాచక పాలన చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

'కోర్టు ఆదేశాలను ధిక్కరించి అచ్చెన్నాయుడును అరెస్టు చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అచ్చెన్న ప్రాణాలకు ఏదైనా జరిగితే వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సీఎం జగన్ విధానాలను ప్రజలు, బీసీ నాయకులు, మేధావులు అందరూ ఎండగట్టాలి' -- బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ

కాపులను ముఖ్యమంత్రి జగన్ దగా చేస్తున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది అర్హులైన కాపు మహిళలు ఉంటే.. 2 లక్షల పైచిలుకు మహిళలకు మాత్రమే పథకం వర్తింప చేశారని చెప్పారు.

'కాపు మహిళలను వైకాపా ప్రభుత్వం మోసం చేసింది. కాపు నేస్తానికి జగన్ రూ. 354 కోట్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వంలో వెయ్యి కోట్లు కేటాయించారు. రైతు రుణమాఫీ కోసం తెదేపా రూ. 4,500 కోట్లు ఇస్తే, వైకాపా ప్రభుత్వం రూ. 1,490 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెదేపా ప్రభుత్వంలో పింఛన్లు, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు, సంక్రాంతి కానుక, ఫీజు రీయింబర్స్​మెంట్, విదేశీ విద్య, ఎన్టీఆర్ వైద్యసేవ, డ్వాక్రా రుణమాఫీ లాంటి పథకాల్లో కాపులు అధిక సంఖ్యలో ప్రయోజనం పొందారు. కాపులకు చేసిన ద్రోహాలను కప్పిపెట్టుకోవడానికి అంకెల గారడీతో ప్రచారం చేసుకుంటున్నారు. '-- నిమ్మల రామానాయుడు, తెదేపా శాసనసభాపక్ష ఉపనేత

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర పరిపాలనపై అవగాహన లేదని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. రాష్ట్రాన్ని అరాచకత్వంతో పాలిస్తున్నారని మండిపడ్డారు.

'అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి 51 మంది తెదేపా నాయకులను జైలు పాలు చేశారు. 340 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కోర్టు ఆదేశాలంటే గౌరవం లేకుండా అచ్చెన్నాయుడును డిశ్ఛార్జ్ చేయడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ తీరుతో పోలీస్ వ్యవస్థ పనితీరును న్యాయస్థానం ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.' -- బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ

ఆనాడు ఇందిరా గాంధీది ప్రకటిత ఎమర్జెన్సీ అయితే, ఇప్పుడు జగన్​ది అప్రకటిత ఎమర్జెన్సీ అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం జగన్ ప్రతిపక్షంపై ఇనుప పాదం మోపుతున్నారని విమర్శించారు.

'రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. రూ. 3 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న అచ్చెన్నాయుడును 300 మంది పోలీసులు అరెస్ట్ చేస్తే.. రూ. 43 వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన వ్యక్తి ఇంటికి ఎంతమంది పోలీసులు వెళ్లాలి. అచ్చెన్నపై ఈ ప్రభుత్వానికి ఎందుకింత కక్షో అర్థం కావడంలేదు.' -- వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు.

ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై, నాయకులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.. మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టంచేశారు. చిరుమామిళ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు.

'జగన్ ప్రభుత్వం రాక్షస వేధింపులకు పాల్పడుతోంది. కోడెల శివప్రసాద్ నుంచి చిరుమామిళ్ల కృష్ణ వరకు తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించింది. ప్రజా సంక్షేమం వదిలేసి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. 190 రోజులుగా రాజధాని అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకున్నవారు లేరు. ప్రత్యేకహోదా ఊసే రాదు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగి.. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు. ' -- దేవినేని ఉమ, మాజీ మంత్రి

ఇవీ చదవండి..: 'వేదిక కూల్చిన చోటే నిర్మిస్తాం.. విధ్వంసాలు మ్యూజియంలో పెడతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.