ETV Bharat / city

కరోనా కట్టడి చర్యలు మాని... ఎన్నికల గురించి మాట్లాడతారా..? - ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదా

సీఎం జగన్​పై తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రపంచమంతా కరోనా నియంత్రణపై చర్యలు చేపడుతుంటే... ప్రభుత్వం మాత్రం స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం వైకాపా అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

tdp leaders fire on ycp govt over caroona affect

author img

By

Published : Mar 21, 2020, 8:16 PM IST

మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమ

ప్రపంచమంతా కరోనా నియంత్రణపై చర్యలు చేపడుతుంటే....రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతుందని తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్ధించిన తర్వాత కూడా మంత్రులు, వైకాపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయస్థానాలంటే గౌరవం లేదా అని ప్రశ్నించారు.

సామాన్యుల పరిస్థితి ఏంటీ..?: చినరాజప్ప

రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్​కే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేమిటని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. వైకాపాది అరాచక ప్రభుత్వమని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వైకాపా అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. కేంద్ర బలగాల సాయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు శూన్యమన్న ఆయన... ప్రజల ప్రాణాలకంటే సీఎం జగన్​కు ఎన్నికలే ముఖ్యమని విమర్శించారు.

సీఎం జగన్ ఎందుకు మాట్లాడరు..?: వర్ల రామయ్య

ప్రధాని పిలుపును ప్రజలంతా శాసనంగా భావించి ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని తెదేపా నేత వర్ల రామయ్య కొరారు. కరోనాపై జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడితే... సీఎం జగన్ ఎందుకు రాష్ర్ట ప్రజలనుద్దేశించి మాట్లాడటం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి అహం వీడి, కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. దేశంలో అత్యంత ఆర్థిక నేరారోపణలున్న వారిని వైకాపా రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటిస్తే... తెదేపా దళిత వర్గానికి చెందిన తనని ప్రకటిచిందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

'ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.