ETV Bharat / city

'మిషన్ బిల్డ్ ఏపీ కాదు... జగన్ కిల్డ్ ఏపీ'

మిషన్ బిల్డ్ ఏపీ అంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణపై తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మి... ఏపీని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు.

tdp leaders
tdp leaders
author img

By

Published : May 14, 2020, 11:50 AM IST

Updated : May 14, 2020, 12:31 PM IST

రాష్ట్ర ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి సీఎం జగన్‌... మిషన్ బిల్డ్ ఏపీ అని పేరు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆ కార్యక్రమం పేరు మిషన్ బిల్డ్ ఏపీ కాదు జగన్ కిల్డ్ ఏపీ అని దుయ్యబట్టారు.

tdp leaders fire on mission build ap program
నారా లోకేశ్ ట్వీట్

దోచుకోవడానికే...

విశాఖలో జగన్‌ దోచుకున్న వేలాది ఎకరాల భూములకు రేట్లు రావడం కోసమే మిషన్ బిల్డ్‌ ఏపీ కార్యక్రమాన్ని తెచ్చారని.. మరో మాజీ మంత్రి దేవినేని ఉమా ఆక్షేపించారు. సంపద సృష్టి చేతకాక ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను అమ్మే అధికారం ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఇది బిల్డ్ ఏపీనా.. లేక సెల్ ఏపీనా అని ప్రజలు అడుగుతున్న దానికి జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దేవినేని ఉమ ట్వీట్

సగం జీతాలిస్తూ విద్యుత్‌ బిల్లులు రెట్టింపు ఇవ్వడం ఏంటని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మండిపడ్డారు. చిన్న గీత పక్కన పెద్ద గీతలా కరోనా కష్టం పక్కన విద్యుత్‌ బిల్లుల కష్టం తెచ్చారని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: హైవేపై చిరుత కలకలం

Last Updated : May 14, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.