వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు మండిపడ్డారు. అమరావతి శాఖమూరులోని అంబేడ్కర్ స్మృతివనం తరలించడం సరికాదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. స్మృతివనంలోనే విగ్రహ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రస్థాయి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
'అమరావతి నుంచి అంబేడ్కర్ విగ్రహ తరలింపు అనాలోచిత నిర్ణయం. 30 శాతం పనులయ్యాక విగ్రహం తరలింపు వెనక ఉద్దేశమేంటి..? విగ్రహం తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి'- ఆలపాటి రాజా, మాజీ మంత్రి
ఇదీ చదవండి: