ETV Bharat / city

Complaint: గుడివాడ క్యాసినో ఘటన.. ఈడీ డైరెక్టర్‌కు తెదేపా నేతల ఫిర్యాదు - ఈడీ డైరెక్టర్‌కు తెదేపా నేతల ఫిర్యాదు

గుడివాడ క్యాసినో ఘటనపై తెదేపా నేతలు ఈడీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. అధికార పార్టీకి చెందిన మంత్రి.. గోవా నుంచి గుడివాడకు యువతులను తీసుకొచ్చి సంప్రదాయాలను నట్టేట ముంచారని నేతలు మండిపడ్డారు.

గుడివాడ క్యాసినో ఘటనపై ఈడీ డైరెక్టర్‌కు తెదేపా నేతల ఫిర్యాదు

author img

By

Published : Feb 8, 2022, 2:54 PM IST

గుడివాడ క్యాసినో ఘటనపై ఈడీ డైరెక్టర్‌కు తెదేపా నేతల ఫిర్యాదు

సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ క్యాసినో ఘటనపై తెదేపా నేతలు ఈడీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. క్యాసినో ఘటనపై విచారణ జరపాలని తెదేపా నేతలు రామ్మోహన్ నాయుడు, ఆలపాటి రాజా ఈడీని కోరారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

"గుడివాడ క్యాసినో ఘటనపై క్షేత్రస్థాయిలో మా పార్టీ నేతలు పరిశీలించారు. గోవా నుంచి గుడివాడకు యువతులను తీసుకువచ్చారు. సంప్రదాయాలు నట్టేట ముంచి క్యాసినో నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఇష్టారీతిలో వ్యవహరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదనే మా ప్రయత్నం. అరాచక శక్తులకు చెక్‌ పెట్టాల్సిన బాధ్యత కేంద్ర సంస్థలపై ఉంది. క్యాసినో ఘటనకు సంబంధించి ఆధారాలు సమర్పించాం. క్యాసినో ఘటనలో భాగస్వామ్యుల వివరాలు సమర్పించాం. ఘటనపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఈడీ విచారణ చేపడితే మరిన్ని నిజాలు బయటపడతాయి" - రామ్మోహన్‌ నాయుడు, తెదేపా ఎంపీ

ఇదీ చదవండి

Gudivada Casino issue: క్యాసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.