ETV Bharat / city

'వేదిక కూల్చిన చోటే నిర్మిస్తాం.. విధ్వంసాలు మ్యూజియంలో పెడతాం' - ప్రజా వేదిక కూల్చివేతపై తెదేపా నేతల ఆగ్రహం

అమరావతి కరకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా సర్కార్ ప్రజావేదికను కూల్చివేయించి ఏడాది పూర్తయిన సందర్భంగా..... ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని... ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'వేదిక కూల్చిన చోటే నిర్మిస్తాం.. విధ్వంసాలు మ్యూజియంలో పెడతాం'

author img

By

Published : Jun 25, 2020, 7:56 PM IST

Updated : Jun 25, 2020, 8:15 PM IST

ప్రజావేదిక కూల్చి ఏడాదైన సందర్భంగా తెదేపా నేతల ఆందోళనలు

కరకట్ట వద్ద ప్రభుత్వం కూల్చివేయించిన ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలను..... పోలీసులు అరెస్టు చేశారు. నేతల రాక సమాచారంతో... పోలీసులను భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే 4 రహదారుల్లో.... చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తెలుగుదేశం నేతల వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతించారు. ప్రజావేదిక వద్దకు వెళ్తున్న పార్టీ సీనియర్​ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, రాజేంద్రప్రసాద్, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య సహా ఇతర నేతలను.... అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడ్డారు. పోలీసులు, తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో... నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించి.... వెంటనే తిరిగి వచ్చేస్తామని నేతలు వివరించినా.. పోలీసులు వినిపించుకోలేదు. వెంట మీడియాను ఎందుకు తీసుకొచ్చారని.. ప్రశ్నించారు.

వారికి చిటికెలో పని..

ఒక భ‌వ‌నం క‌ట్టడం ఎంత క‌ష్టమో.. కూల‌గొట్టడం చిటికెలో ప‌నని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఇది తెలిసి కూడా జ‌గ‌న్‌ రెడ్డి విధ్వంసానికే జై కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అంటే న‌వ్యాంధ్ర నిర్మాత‌ని, జ‌గ‌న్‌రెడ్డి అంటే న‌వ్యాంధ్ర నాశ‌నానికి కంక‌ణం క‌ట్టుకున్న అరాచ‌క పాల‌కుడ‌ని ప్రజావేదిక శిథిలాలు.. సాక్ష్యం చెబుతున్నాయని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తెదేపా నేతల అరెస్టులను ఆయన ఖండించారు.

ప్రజాధనం మట్టిపాలు

ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్లు ప్రజాధనం మట్టిపాలు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. సీఎం జగన్​ విధ్వంసంతో పాలన ప్రారంభించారని ఎద్దేవా చేశారు. నెల్లూరు, మడకశిర, మాచర్లలో పేదల ఇళ్లను, నర్సరావుపేటలో అన్న క్యాంటీన్లను కూల్చివేశారని కళా మండిపడ్డారు. అధికారులను అడ్డుపెట్టుకుని... సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని... దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి నివాసం నుంచి.... సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

వెనక్కి తగ్గేది లేదు

తెలుగుదేశం నేతలపై ఎన్ని అక్రమకేసులు పెట్టినా...... వెనకడుగేసేది లేదని నేతలు తేల్చి చెప్పారు. కూలగొట్టిన ప్రజావేదికను తిరిగి నిర్మించి వైకాపా విధ్వంసాలను మ్యూజియంలో పెడతామని హెచ్చరించారు. అరెస్ట్‌ చేసిన తెదేపా నేతలను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఇదీ చూడండి:

తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డికి కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ వివరణ

Last Updated : Jun 25, 2020, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.