ETV Bharat / city

Yanamala: తెదేపా అధికారంలోకి రావడం ఖాయం: యనమల - వైకాపాపై యనమల ఫైర్

yanamala rama krishnudu
yanamala rama krishnudu
author img

By

Published : Oct 14, 2021, 10:30 AM IST

Updated : Oct 14, 2021, 12:38 PM IST

10:24 October 14

నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారు: యనమల

యనమల

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(yanamala news). తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో పార్టీ నూతన  కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యనమల.. జిల్లాలో ప్రత్తిపాడు తెదేపాకు బలమైన నియోజకవర్గమని తెలిపారు.  నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు(yanamala fires on ycp govt news).  తెదేపా చేసింది తప్ప వైకాపా చేసిన అభివృద్ధే లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం హద్దులు దాటి అప్పులు చేస్తోందని యనమల విమర్శించారు(yanamala comments on ap financial crisis news). ప్రభుత్వం చేసిన అప్పుల భారం ప్రజలపైనే పడుతుందన్నారు. ప్రభుత్వం విపరీతంగా దుబారా ఖర్చులు చేస్తోందన్న ఆయన.. అప్పులు తీర్చే పరిస్థితులు కన్పించట్లేదని వ్యాఖ్యానించారు.  

'రాష్ట్రం అంధకారంలో ఉంది. పాలనపై జగన్‌కు అవగాహన లేదు. రహదారులపై గుంతలు పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. అప్పులు తెచ్చిన డబ్బులు ఏంచేస్తున్నారో అర్థంకావట్లేదు. రూ.41 వేల కోట్లకు లెక్కలు చెప్పట్లేదు. అధిక శాతం వడ్డీకి రుణాలు తెస్తున్నారు' - యనమల రామకృష్ణుడు, తెదేపా సీనియర్ నేత

ఇదీ చదవండి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

Last Updated : Oct 14, 2021, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.