ఎస్ఈసీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంలోకి నెట్టిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగినదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఇది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలతో ఆటలాడవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించటంతోనే ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని అన్నారు.
ఇదీ చూడండి.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం