ETV Bharat / city

'కరోనా నివారణ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి' - tdp leader anuradha comments on ycp government news

కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. సంక్షోభం సమయంలోనూ మద్యం దుకాణాలు తెరచి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిధుల ఖర్చుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

'ప్రచార కాంక్షతో వైకాపా నేతలే కరోనా బారిన పడుతున్నారు'

author img

By

Published : Jul 23, 2020, 4:07 PM IST

Updated : Jul 23, 2020, 4:20 PM IST

ప్రచార ఆకాంక్షతో మంత్రులు, ప్రజా ప్రతినిధులే కరోనా బారిన పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆర్భాటంగా ప్రారంభించిన అంబులెన్సులు ఏమయ్యాయన్న ఆమె.. చనిపోయిన వారిని జేసీబీలతో తరలించడం ఏంటని నిలదీశారు. కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా.. ప్రజలు గుమికూడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అయినా మద్యం దుకాణాలు తెరవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

జే-ట్యాక్స్​ పేరుతో నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అనురాధ మండిపడ్డారు. కేంద్రం నిధులు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు చేశారనే దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి..

'రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం పిటషన్​పై కౌంటర్ ఎందుకు వేయడం లేదు?'

Last Updated : Jul 23, 2020, 4:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.