ETV Bharat / city

'వెరిఫికేషన్ పూర్తైన వారితో సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయండి' - ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు వార్తలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. గతంలో వెరిఫికేషన్ పూర్తైన వారికి అవకాశం కల్పించకుండా రెండో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు.

లోకేశ్
లోకేశ్
author img

By

Published : Aug 21, 2020, 6:33 PM IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు గత నోటిఫికేషన్​లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ జాబితాలో పేర్లున్న అభ్యర్థులకు పోస్టింగ్​లు ఇవ్వాలని సీఎం జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైనప్పటికీ చాలామందికి నియామకపత్రాలు అందక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

వారికి అన్యాయం చేయకండి

0.25, 0.50, 0.75 & 1 మార్కు తేడాతో అన్ని పోస్టులకు వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులు రాష్ట్రంలోని 13 జిల్లాలో వేలమంది ఉన్నారన్న లోకేశ్... ఈ నియామకాల గురించి అధికారులను సంప్రదిస్తే ఎటువంటి ఆదేశాలు లేవని చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో రెండో దఫా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైన వారు, స్వల్ప తేడాతో ఎంపికై వెయిటింగ్ లో ఉన్నవారిలో ఆందోళన మొదలైందని వెల్లడించారు. కొత్త నోటిఫికేషన్ నిర్వహించడమంటే ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉన్న వారందరికీ అన్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఉద్యోగాలకు రాజీనామా చేసిన, ఇతర కారణాలతో ఖాళీ అయిన స్థానాలను, తొలి విడత పరీక్షలో అర్హత సాధించి మెరిట్ లిస్ట్ లో ఉన్న వారితో, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులతో భర్తీ చేయాలని సూచించారు.

రెండో నోటిఫికేషన్ సరికాదు

అదనంగా ప్రభుత్వం ప్రకటించిన 3000 పోస్టులను మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో భర్తీ చేయాలని లేఖలో లోకేశ్ కోరారు. అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ పోస్టులు మిగిలిపోయాయనే కారణంతో రెండో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రెండోసారి పరీక్షలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం లేనందున మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థులచే ఆయా పోస్టులన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : పూజ గదుల్లో రాజకీయ జోక్యాన్ని భరించాలా? : రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.