ETV Bharat / city

స్వార్థ ప్రయోజనాల కోసమే.. విశాఖ ఉక్కు తాకట్టు: లోకేశ్​ - నారా లోకేశ్​ ఆరోపణలు

విశాఖ స్టీల్​ ప్లాంట్​ స్వార్థ రాజకీయాలకు బలవుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సూట్​కేసు కంపెనీలతో తక్కువ రేటుకు పరిశ్రమను దక్కించుకునేందుకేనని ఆక్షేపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు.

nara lokesh comments on visaka steel plant
విశాఖ ఉక్కు తాకట్టు స్వార్థ ప్రయోజనాలకోసమే : లోకేశ్​
author img

By

Published : Feb 5, 2021, 5:08 PM IST

జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కును తాకట్టు పెడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్యమంత్రి మౌనం వహించడం దేనికి సంకేతమని నిలదీశారు. ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే ఇలా ఒక్కో ప‌రిశ్రమను అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా అని మండిపడ్డారు.

32 మంది ప్రాణత్యాగాల ఫలం విశాఖ ఉక్కు:

28 మంది వైకాపా ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని లోకేశ్ స్పష్టం చేశారు. వేలాది మంది ప్రత్యక్షంగా, ల‌క్షలాదిమంది ప‌రోక్షంగానూ దీని ద్వారా ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు.

  • వేలాది మంది ప్ర‌త్య‌క్షంగా,ల‌క్ష‌లాదిమంది ప‌రోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి మౌనం దాల్చ‌డం దేనికి సంకేతం?(2/4)#VisakhaUkkuAndhrulaHakku

    — Lokesh Nara (@naralokesh) February 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఒక్కొక్కరికీ ఒక్కోటి:

కాకినాడ పోర్టు విజ‌యసాయిరెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చి, విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారని ఆరోపించారు. త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారని దుయ్యబట్టారు.

  • త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారు.‌ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారు.ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం.(4/4)#VisakhaUkkuAndhrulaHakku

సూట్​కేసు​ కంపెనీలతో కొనేెందుకే..

ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్​ను తన సూట్ కేసు కంపెనీలతో తక్కువ రేటుకు కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేయనున్నారని లోకేశ్ ఆక్షేపించారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ట్విట్టర్​లో తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై.. కార్మికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.