ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో అర్హత సాధించని ఆరుగురు అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. తాజా ఫలితాలతో గ్రూప్-1లో అక్రమాలు నిర్ధారణ అయ్యాయని (tdp leader lokesh on appsc frauds) ఆయన ఆరోపించారు. సివిల్స్ ఫలితాలతో సీఎం జగన్ ధనదాహం వెలుగుచూసిందని ప్రకటనలో విమర్శించారు.
గ్రూప్-1లో ప్రభుత్వ అక్రమాలకు బలైన సంజనాసింహాకు 207వ ర్యాంకు, బయ్యపురెడ్డి చైతన్యకు 604, యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 93, సాహిత్యకు 647, జగత్‌సాయికి 32, వసంత్‌కుమార్‌కు 170వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. ఈ ఆరుగురు గ్రూప్-1 నియామకాల్లో అన్యాయం జరిగిందని న్యాయస్థానంలో కేసు వేసినవారేనని గుర్తు చేశారు. ఇప్పుడు వీరికే సివిల్స్ ర్యాంకులు రావడంతో జగన్ బృందం అక్రమాలపై చర్చ సాగుతోందని లోకేశ్ ఆరోపించారు.
ఇదీ చదవండి: civils rankers: సివిల్స్‌లో తెలుగు తేజాలు