ETV Bharat / city

సీఎం కరోనాను సైతం కక్ష సాధింపు కోసం వాడుకున్నారు: లోకేశ్​ - tdp leader nara lokesh criticise cm jagan on jc prabhakar and asmithreddy arrest news

కక్ష సాధింపులో భాగంగానే సీఎం జగన్​ జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిలను అరెస్టు చేయించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. వైకాపా నేతలు ఇష్టారీతిన తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమైతే కనీసం చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. జగన్​ చేతిలో అధికారం ఎంత ప్రమాదమో ప్రజలు చూస్తున్నారని లోకేశ్​ అన్నారు.

సీఎం కరోనాను సైతం కక్ష సాధింపు కోసం వాడుకున్నారు: లోకేశ్​

author img

By

Published : Aug 8, 2020, 12:48 AM IST

lokesh
లోకేశ్​ ట్వీట్​

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​.. ప్రజలను గాలికొదిలేసి కరోనాను సైతం కక్ష సాధింపు కోసం వాడుకునే స్థితికి దిగజారిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. నేర స్వభావం ఉన్న జగన్ లాంటి వ్యక్తి చేతిలో అధికారం.. ఎంత ప్రమాదమో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. కరోనా సమయంలో విచ్చలవిడిగా తిరిగి వైరస్​ వ్యాప్తికి కారణమైన వైకాపా నేతలపై చర్యలు తీసుకుపోగా... కొవిడ్​ పెద్ద విషయమే కాదంటూ జగన్​ సెలవిచ్చారని లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు కరోనా పేరుతోనే జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిలను అరెస్టు చేశారని లోకేశ్​ తెలిపారు. వారి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వారిపై అట్రాసిటీ కేసులు కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆక్షేపించారు. కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ ప్రజలపై పెట్టి ఉంటే నేడు వారికి ఇన్ని కష్టాలు వచ్చేవి కావని లోకేశ్​ అన్నారు.

ఇదీ చూడండి..

విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్​పై 'దిశా' స్టేషన్​లో ఫిర్యాదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.