ETV Bharat / city

రాష్ట్రంలోని వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కళా

author img

By

Published : Oct 18, 2020, 2:13 PM IST

వరద బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు నష్టపోతే జగన్ సర్కార్ కనీసం స్పందించడం లేదని దుయ్యబట్టారు.

TDP leader Kala Venkatrao comments on Flood Management
తెదేపా నేత కళా వెంకట్రావు

వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం.....తాడేపల్లి రాజప్రాసాదంలో కాలం వెళ్లదీస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దుయ్యబట్టారు. వరద సాయంగా 500 రూపాయలు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. నీటి నిర్వహణను గాలికొదిలేసి కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆక్షేపించారు. లంక గ్రామాల ప్రజలకు అవస్థలు తెచ్చారని మండిపడ్డారు.

ముందుగా అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడే ఆర్టీజీఎస్​ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరదలు ముంచెత్తాయని కళా విమర్శించారు. తక్షణమే వరద బాధితులకు ప్రభుత్వం సాయమందించి, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: తక్షణ సాయం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.