ETV Bharat / city

kala venkatarao: '56 కార్పొరేషన్లంటున్నారు.. బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడరేం' - welfare schemes for BCs in ap news

వైకాపా ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీల గురించి మాట్లాడే హక్కు వైకాపాకు లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతి, పథకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

TDP leader  Kala Venkata Rao
TDP leader Kala Venkata Rao fiers on ycp govt
author img

By

Published : Aug 20, 2021, 7:02 PM IST

బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్​ సహా వైకాపా నేతలెవ్వరికీ లేదని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్​ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో ఓట్లు వేయించుకుని వారినే వంచించారని ధ్వజమెత్తారు. జగన్​రెడ్డిని రాజకీయంగా పాతరేసేందుకు బడుగులు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు.

56 కార్పొరేషన్లంటున్న వైకాపా.., బడ్జెట్ కేటాయింపులపై ఎందుకు మాట్లాడటం లేదని కళా ప్రశ్నించారు. చేతి వృత్తుల వారికి తెదేపా హయాంలో ప్రోత్సాహకాలు, రాయితీలు అందేవని గుర్తు చేశారు. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ నుంచి 18,226 కోట్లు మళ్లించారని మండిపడ్డారు. కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా ఏ ఒక్కరికీ రుణాలివ్వలేదని విమర్శించారు. ఈ రెండేళ్లలో పెళ్లి కానుకలు ఎంత మందికిచ్చారని నిలదీశారు. టీటీడీ, ఏపీఐఐసీ వంటి కీలక సంస్థలకు బీసీలను ఛైర్మన్లుగా ఎందుకు నియమించలేదని ఆక్షేపించారు. బీసీల అభ్యున్నతి, పథకాలపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అంకెల గారడీతో వంచిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: CURFEW EXTEND: సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.