ETV Bharat / city

'గోడౌన్​లో గుట్కా: ఆ వైకాపా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలి' - వైసీపీ ఎమ్మెల్యేలు గుట్కా స్కామ్ పై టీడీపీ కామెంట్స్

వైకాపా ఎమ్మెల్యేలు ఏపీని గుట్కా కేంద్రంగా మారుస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా కొప్పురావూరులో ఎమ్మెల్యే ముస్తఫాకు చెందిన గోడౌన్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి బావమరిది నిషేధిత గుట్కాలు తయారుచేసి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. 10 కోట్ల రూపాయల సరకు దొరికితే ... కోటి సరకు స్వాధీనం చేసుకున్నామంటూ విజిలెన్స్ అధికారులు తగ్గించి చెబుతున్నారన్నారు. విజిలెన్స్, పోలీసు అధికారులపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడి తెచ్చారన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి విజిలెన్స్ కార్యాలయానికి ఎందుకు వెళ్లారని జవహర్ ప్రశ్నించారు.

మాజీ మంత్రి జవహర్
మాజీ మంత్రి జవహర్
author img

By

Published : Jul 22, 2020, 9:43 PM IST

ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవడంలో వైకాపా ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కాలు తయారుచేసే మాఫియా వెనుక ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు ముస్తఫా, రామకృష్ణారెడ్డిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో ఎమ్మెల్యే ముస్తఫాకు చెందిన గోడౌన్ లో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బావమరిది మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి నిషేధిత గుట్కాలు తయారుచేసి ఆరు రాష్ట్రాలకు అక్రమంగా తరలించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.

గుట్కా ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర బిందువుగా మార్చారని జవహర్ ధ్వజమెత్తారు. 10 కోట్ల రూపాయలకు పైగా సరకు దొరికితే.. కోటి సరకే స్వాధీనం చేసుకున్నామంటూ తగ్గించి చెబుతున్నారని దుయ్యబట్టారు. విజిలెన్స్, పోలీసు అధికారులపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒత్తిడి తెచ్చి కేసును నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆర్.కె విజిలెన్స్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గుట్కాను పట్టుకున్న వెంటనే ముస్తఫాకు చెందిన ఇతర గోడౌన్లలో ఉన్న సరకును లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.

ఇదీ చదవండి : ఎస్ఈసీపై గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్య విజయం: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.