ముఖ్యమంత్రి, మంత్రులు.. ప్రతిపక్ష నాయకుడిపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు డీజీపీకి అది కనిపించలేదా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు చెబితే ఎందుకు భరించలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ ఉంటారని.. ఆ క్రమశిక్షణ తప్పితే వైకాపా నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే తిరిగి రెండు చెంపల మీద కొట్టే సత్తా తెలుగుదేశం కార్యకర్తలుకు, నాయకులకు ఉందన్నారు.
ఇదీ చదవండి: