రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ముఖ్యమంత్రి జగన్ కులం రంగు పులమడాన్ని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే అధికారపక్షం ఎందుకు ఉలిక్కిపడుతోందని నిలదీశారు. ప్రజల ప్రాణాల కంటే విజయసాయిరెడ్డికి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన మరో కరోనా వైరస్.. ఏ2 విజయసాయిరెడ్డి అని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చడానికే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి కులాన్ని ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి : భారత్ కథనానికి స్పందన... టమాటా రేట్లపై అధికారుల ఆరా